మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : గురువారం, 10 మార్చి 2016 (15:31 IST)

ఒత్తిడి తగ్గించే చేపలతో.. బటర్ ఫిఫ్ ఫ్రై ఎలా చేయాలి?

ఒత్తిడి తగ్గించే చేపలతో.. బటర్ ఫిఫ్ ఫ్రై ఎలా చేయాలి?

చేపలను వారానికోసారి తినడం ద్వారా స్త్రీ, పురుషులు ఒత్తిడి లోనుకారు. చేపల్లో పోషకపదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఎవరైనా చేపలు ఎక్కువ తింటున్నామని చెపితే వారు ఎంతో పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నట్లే. అలాంటి చేపలతో హెల్దీ అయిన బటర్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...  
 
కావలసిన పదార్థాలు : 
చేప ముక్కలు : అర కేజీ 
కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, 
వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, 
మైదా: టేబుల్‌ స్పూను, 
బేకింగ్‌పౌడర్‌: టీ స్పూను, 
వెల్లుల్లి, కొత్తిమీర తురుము: పావు కప్పు
నూనె, ఉప్పు : తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్‌, బేకింగ్‌ పౌడర్‌ కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మిశ్రమాన్ని కాస్త జారుగా కలపాలి. ఇప్పుడు దీన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు నాననివ్వాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో వెన్న వేసి కరిగాక చేప ముక్కలు కొద్దికొద్దిగా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి.