గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (17:55 IST)

సండే స్పెషల్.. వెన్నతో కొరమీను చేపల ఫ్రై ఎలా చేయాలంటే?

చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. ఇవి డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. మానసిక ఆందోళనను పోగొడతాయి. అదీ కొరమీను చేపలను వారానికి ఓసారి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా దరిచేరవు. అలాంటి కొరమీనును వెన్నతో ఫ్పై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె, ఉప్పు - తగినంత
మిరియాల పొడి- ఒకటిన్నర స్పూన్ 
నిమ్మకాయ - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు- ఒక కప్పు 
 
తయారీ విధానం:
ముందుగా శుభ్రపరిచిన కొరమీను చేపల్లోని ముల్లును తీసేయాలి. ఈ మీనుకు ఒకే ఒక ముల్లు వుంటుంది. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ చేప ముక్కలకు ఉప్పు, మిరియాలపొడి, ఒక స్పూన్ నూనె చేర్చి బాగా కలిపి అర్థగంట పక్కనబెట్టేయాలి. తర్వాత బాణలిలో నూనె పోసి బాగా ఆరిన తర్వాత ఆ చేప ముక్కులను వేసి దోరగా వేపుకోవాలి. ఈ చేపల ఫ్రైని దించేటప్పుడు వెన్న రాసి, కొత్తిమీర తరుగును చేర్చి దించేయాలి. అంతే వేడి వేడి కొరమీను చేపల ఫ్రై సిద్ధమైనట్లే.