సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 15 మే 2023 (21:57 IST)

ప్రముఖ పాత్రికేయుడు కిలారు ముద్దుకృష్ణ మృతి పట్ల నాట్స్ సంతాపం

image
ప్రముఖ పాత్రికేయులు కిలారు ముద్దుకృష్ణ ఆకస్మిక మృతి తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. టీఎన్‌ఐ లైవ్. కామ్ యుఎస్ఏ ద్వారా ప్రవాస తెలుగువారి వార్తలను ఎప్పటికప్పుడు సమగ్రంగా అందించే పాత్రికేయుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. తెలుగు సంఘాలతో నిత్యం అనుసంధానమై అమెరికాలో తెలుగువారి వార్తలను కవర్ చేసే కిలారు ముద్దుకృష్ణ ఇక లేరని వార్త తమను కలిచివేస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి పేర్కొన్నారు.
 
 సెయింట్ లూయిస్ నుండి నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, న్యూ జెర్సీ నుండి నాట్స్ బోర్డు సభ్యులు,  నాయకులు మోహన్ మన్నవ, గంగాధర్ దేసు, సామ్ మద్దాలి, మురళీ కృష్ణ, శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ళ,  సాయి దత్తపీఠం నుండి రఘుశర్మ శంకరమంచి, న్యూ జెర్సీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, నృత్యమాధవి స్కూల్ అఫ్ డాన్స్ నుండి వేణు ఏలూరి, దివ్య ఏలూరి తమకు ముద్దుకృష్ణ తో ఉన్న పరిచయాన్ని, అనుబంధాన్ని  గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి సానూభూతిని తెలియచేసారు.
 
నాట్స్ తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 10 రోజులలో న్యూ జెర్సీ రావాల్సి ఉన్న ముద్దుకృష్ణ మనల్ని వీడి వెళ్ళటం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి సానుభూతిని తెలియచేశారు.