సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2019 (19:48 IST)

పల్నాటి పులి కోడెల, మాజీ ఎం.పి నారమల్లి శివప్రసాద్‌కి ఘన నివాళి: న్యూజెర్సీ ఎన్నారై తెదేపా

న్యూ జెర్సీ: ప్రవాస న్యూజెర్సీ తెలుగుదేశం అభిమానులు నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాద్ గారి పెద్ద కర్మ సందర్భంగా న్యూజెర్సీ లోని ఎడిసన్ నగరంలో పల్నాటి పులి కోడెల శివ ప్రసాద్ గారికి, మాజీ ఎం.పి నారమల్లి శివప్రసాద్ గారికి ఘన నివాళి అర్పించారు.
 
NATS మాజీ అధ్యక్షులు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారితో  తనకున్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. 
 
అన్న నందమూరి తారక రామారావు అప్పట్లోనే కోడెల ప్రతిభని గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించారు, నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కోడెల గారికి పలు కీలక బాధ్యతలు అప్పగించారు అని తెలిపారు. కోడెల శివప్రసాద్ గారు అనేక కీలక శాఖలకు మంత్రిగా చేసి ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు.
 
ఈ సందర్భంగా పలువురు న్యూజెర్సీ NRI తెలుగుదేశం నాయకులు ప్రసంగించారు. ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా కోడెల జన హృదయాల్లో నిలిచిపోయారు అని కొనియాడారు, కోటప్ప కొండ అభివృద్ధికి, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ అభివృద్ధికి కోడెల శివ ప్రసాద్ గారు ఎంతో పాటుపడ్డారు అని కీర్తించారు. అలాగే శ్రీ N.శివ ప్రసాద్ గారు రాష్ట్ర విభజనను నిరసిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపించారు అని కొనియాడారు. N.శివ ప్రసాద్ గారు మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ఎన్నో సేవలందించారని కొనియాడారు.
 
ఇద్దరు మంచి నాయకులని తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలియచేశారు. కార్యక్రమంలో పలువురు న్యూ జెర్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు - శ్రీహరి మందాడి, రాజా కసుకుర్తి, రాధా కృష్ణ నల్లమల, వంశీ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్ వెనిగళ్ల, విష్ణు కనపర్తి, శ్రీ చౌదరి, నంద కల్లూరి, శ్రీనివాస్ ఓరుగంటి, సురేష్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేష్ బేతపూడి, ఇంకా అనేక మంది న్యూజెర్సీ  తెలుగుదేశం అభిమానులు పలువురు పాల్గొని ఇద్దరు నాయకులకి ఘనంగా నివాళులు అర్పించారు.