శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 12 మే 2015 (19:24 IST)

జూలై 2న తానా 20వ మహాసభలు.. జోరుగా రిజిస్ట్రేషన్లు..!

తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, మహాసభల కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జూలై 2, 3, 4 తేదీలలో డిట్రాయిట్‌లో జరగబోతున్న 20వ తానా మహాసభల సన్నాహాలు ఊపందుకున్నాయి. వివిధ కమిటీలు ఈ మహాసభలు జయప్రదంగా జరగడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. కమిటీలలో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ కమిటీ వివరాలు...
 
ప్రశ్న- ఈ సంవత్సరం జూలై నెలలో డిట్రాయిట్‌లో జరుగనున్న తానా మహాసభలకు రిజిస్ట్రేషన్ విభాగం పనితీరుని వివరించండి!
డెట్రాయిట్‌లో తానా మహాసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నాటి నుండి, రిజిస్ట్రేషన్ విభాగం 80 మంది వాలంటీర్లతో నిర్దిష్ట ప్రణాళికతో కార్యాచరణ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను గతం కన్నా సరళీకృతం చేశాము. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించాము. సమయం వృధా కాకుండా, ఇబ్బందులు కలుగకుండా మహాసభలకు వచ్చే వారికి ముందుగా సమాచారం అందించడానికి కృషి చేస్తున్నాము.
 
ప్రశ్న- తానా సమావేశాలలో ''ప్రవేశ రుసుము''తో పాటు వచ్చే ప్రయోజనాల గురించి చెప్పండి?
జూలై 3, 4న తేదీలలో జరిగే తానా మహాసభలకు ప్రవేశ రుసుము, చెల్లించిన వారికి భోజన సదుపాయాలు ఉంటాయి. జూలై 2వ తేది 'బాన్కేట్ డిన్నర్'కు ప్రత్యేక ప్రవేశ రుసుము ఉన్నప్పటికీ, హాలులో ఉన్న సీట్లను దృష్టిలో పెట్టుకుని దాతలకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ కమిటీలలో పని చేస్తున్న వాలంటీర్లకు ప్రత్యేకంగా డోనరు(దాతల) కేటగిరిలో 250 డాలర్ల డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం వాలంటీర్లకు, దాతలకు ఇవ్వడం జరిగింది. అన్ని వివరాలకు తానా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
 
ప్రశ్న- ఇంత పెద్ద మహాసభలకు పదివేలకి పైగా అతిథులు వేంచేస్తారు కదా! వీరందరికి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు?
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, సమగ్ర సమాచారం, అత్యధిక సంఖ్యలో వాలంటీర్లు, కమిటీ సభ్యులను రిజిస్ట్రేషన్ విభాగంలో సేవలను వినియోగించుకోవడం, కొందరికి ప్రత్యేక బాధ్యతలు, సభ్యులతో సమావేశాలు, సమాఖ్యలు, వివిధ కేటగిరీలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ విభజన ఏర్పాటు చేసి బాధ్యతలను ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసే వారికి సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది.
 
ఇందులో భాగంగా మే 9న జరిగిన ప్రత్యేక “ Early Bird Registration Drive” కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించి దాదాపు 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మా రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధతో ఎటువంటి సమస్య లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం గమనార్హం. అందుకు మా రిజిస్ట్రేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 
 
ప్రశ్న- రిజిస్ట్రేషన్ విభాగం అన్నది చాలా బాధ్యత గల విభాగం. ఈ విభాగంలో పనిచేస్తున్న వారికి ఈ రోజు నుండి మహాసభలు జరిగే వరకు చాలా ఒత్తిడి ఉంటుంది. వీటిని అధిగమించడానికి ఏ విధమైన ప్రణాళికను రూపొందించనున్నారు. విధివిధానాలలో ఏమైనా మార్పులు చేశారా?
అవును. రిజిస్ట్రేషన్ విభాగం అత్యంత భాద్యతాయుతమైన, ప్రధానమైన విభాగం. దీనిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాము. 'సరళీకృత విధానం'లో ఈ ప్రక్రియను అందుబాటులోనికి తెస్తున్నాము. వత్తిడికి తావులేకుండా, అందరినీ సమన్వయ పరుస్తూ, సూచనలు, సలహాలు, సమీక్ష సమావేశాల ద్వారా విశ్లేషణలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
 
గతంలో కంటే ఎక్కువగా స్పందనను దృష్టిలో పెట్టుకుని అతిథులకు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారందరికీ ఇబ్బంది రాకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాము. గతంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు, కార్యక్రమాల వివరణలు, రిజిస్ట్రేషన్‌కు సంభందించిన అన్ని విషయాలు సరళీకృతం చేశాము. దూర ప్రాంతాల నుండి ఫోన్ కాల్స్ చేస్తున్నావారి అనుమానాలు నివృత్తి చేస్తున్నాము. సభ్యులందరూ అప్రమత్తతతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 
 
ప్రశ్న- తానా 20వ మహాసభలు విజయవంతం చేసేందుకు ఎవరెవరు కృషి చేస్తున్నారు. దీని గురించి కొంచం వివరించి చేప్తారా?
తానా 20వ మహాసభలు విజయవంతంగా జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వివిధ కమిటీల వారు, వాలంటీర్లు, కోర్ కమిటీ సభ్యులు, తానా కార్యవర్గం, తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, మహాసభల కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ ఆధ్వర్యంలో సభలను జయప్రదం చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చేస్తున్న పనులు, ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అందరిని భాగస్వామ్యులను చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, 'ధింతానా' జాతీయ స్థాయిలో ఆటల క్రీడల పోటీలు, భోజన వసతి సదుపాయాలు, రిజిస్ట్రేషన్, రవాణా, వసతి, సాహితి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ప్రధానంశాలన్నిటికిని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సభలకు ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి, భారతదేశం నుండి, ఇతర దేశాల నుండి వచ్చేవారి స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచార కార్యక్రమాలు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది.
 
రిజిస్ట్రేషన్ క్యాటగిరీ ధర ( 5/18 వరకూ) Price (5/18 తర్వాత)
పెద్దలకు ఒకరికి $150 $175
బాలలు – వయసు 6-17 ( 5 ఏళ్ల కంటే తక్కువైతే ఉచితం) $75 $110
ఫుల్ టైమ్ స్టూడెంట్ (స్టూడెంట్ ఐడి కావాల్సి ఉంటుంది.) $100 $125
జంట (భార్య & భర్త) $275 $325
సీనియర్ సిటిజన్ – వయసు 65 మరి అంతకుమించి $100 $125
సందర్శకుడు (వీసా ధృవీకరణ అవసరం) $100 $125
రిజిస్ట్రేషన్ల కోసం, మరిన్ని వివరాల కోసం tana2015.org లోకి లాగిన్ అవ్వండి.