శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (14:31 IST)

అవిసె ఆకుతో విష్ణుప్రీతి.. ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే?

అమావాస్య వ్రతం, ఏకాదశి వ్రతం వుండేవారు.. పితృదేవతల సంతృప్తి కోసం ఆవుకు అవిసె ఆకు ఇవ్వడం చేయాలి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం వుండేవారు ద్వాదశి రోజున అవిసె ఆకును ఆవులకు ఆహారంగా ఇవ్వడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేగాకుండా శనివారం పూట విష్ణు సహస్ర నామంలోని ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే.. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా విష్ణుసహస్రనామాలను పఠించిన ఫలితం దక్కుతుంది. 
 
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
 
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలు. 
 
పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు. ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు. అదే శ్రీరామ రామ రామేతి మంత్రం.