శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (08:41 IST)

సోమవారం మీ రాశిఫలితాలు : ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే...

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయ

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. 
 
వృషభం: స్థిరాస్తిని అమర్చుకుంటారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. చిట్స్, ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. 
 
మిథునం: మాట్లాడలేని చోట మౌనం వహించండి మంచిది. పెద్దల ఆరోగ్యములో మెళుకవ అవసరం. పోస్టల్, ఎల్ఐసి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన విషయాలు మీ జీవితభాగస్వామికి తెలియచేయటం మంచిది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
కర్కాటకం: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పండ్లు, కొబ్బరి వ్యాపారులకు కలిసివస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యావహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం: ఉద్యోగస్తులు, అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులు తప్పవు. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
కన్య: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. విద్యార్థులు అధిక కృషి అనంతరం మంచి ఫలితాలను సాధిస్తారు. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. బంధువులు, ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. 
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయ సంపాదన దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆకస్మిక ప్రయాణాల్లో చికాకులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు.
 
ధనస్సు: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణల వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు తప్పవు. గృహోపకరణాలు అమర్చుకుంటారు.
 
మకరం: దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు యత్నిస్తారు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. రాబోయే ఖర్చులకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కుంభం: ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఉద్యోగస్తులు అధికారులకు మాధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలవు. పత్రికా సిబ్బంది మార్పుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకుంటారు.
 
మీనం: ఆదాయ వ్యయాల్లో ఆచితూచి వ్యవహరించండి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు శుభదాయకం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి, ఉద్యోగాలందు ఆశించిన ఆదాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మందలింపులు, విమర్శలను ఎదుర్కొంటారు.