గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (09:42 IST)

ఈ రోజు దినఫలితాలు : చిన్ననాటి మిత్రులతో...

మేషం : ఆర్థిక లావాదేవీలు, సమావేశాలతో హడావుడిగా ఉంటారు. ఏ పని సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండర

మేషం : ఆర్థిక లావాదేవీలు, సమావేశాలతో హడావుడిగా ఉంటారు. ఏ పని సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
వృషభం : సిమెంట్, ఇటుక, కలప, ఐరన్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రుణాలు తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
 
మిథునం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. ఉపాధ్యాయులు విమర్శలు ఎదుర్కొనవలసివస్తుంది. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రాబడికి మించి ఖర్చులు అధికమవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తారు.
 
సింహం : విద్యార్థుల ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఎంతకష్టమైనపనైనా అవలీలగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
కన్య : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. విద్యార్థులకు దూకుడు తగదు. కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు బంధువులు యత్నిస్తారు. రాజకీయాల్లోని వారికి శత్రువులు అధికమవుతున్నారని గమనించండి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. గృహ నిర్మాణాలకు కావలసిన బ్యాంకు రుణాలు మంజూరు కాగలవు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది.
 
వృశ్చికం : విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఒక సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తారు. ఆపద సమయంలో కుటుంబీకులు అండగా నిలబడతారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి.
 
ధనస్సు : వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. వాహనం నిదానంగా నడపండి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ప్రత్యర్థుల కదలికలను గమినిస్తూ వుండాలి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు.
 
మకరం : మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించండి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పాత మిత్రులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. ఒక కార్య సాధన కోసం ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వుంటుంది.
 
కుంభం : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. వైద్యరంగంలోని వారు అరుదైన శస్త్రచికిత్సలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
 
మీనం : బంధువులు, అయినవారి రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ శ్రీమతి అవసరాలు, కోరికలు తీరుస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.