శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (09:39 IST)

శుక్రవారం దినఫలితాలు : ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే అవకాశం ఉంది..

మేషం : ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్‌ఫలితాలనిస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలలో జయం పొందుతారు. రావలసిన బాకీలు అందుతాయి. ప్రకటనల

మేషం : ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్‌ఫలితాలనిస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలలో జయం పొందుతారు. రావలసిన బాకీలు అందుతాయి. ప్రకటనలు, ఫోన్‌ల సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులను విశ్వసించవద్దు. 
 
వృషభం : ధనానికి ఇబ్బంది ఉండదు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల సందర్శనం సాధ్యంకాదు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహమార్పు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికానవస్తుంది. మీ సంతానం భవిష్యత్ పట్ల శ్రద్ధ వహించండి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. 
 
మిథునం : వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
కర్కాటకం : ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీముల కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. సాహయ ప్రయత్నాలు విరమించండి. 
 
సింహం : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నిరుద్యోగులకు అవకాశాలను తక్షణం  వినియోగించుకోండి. వ్యాపార వర్గాల మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
కన్య : రాజకీయ నాయకులు ప్రయాణాలలో మెళకువ అవసరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. టెండర్లు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చక్చకు వస్తాయి. రుణ బాధలు, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
తుల : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలలో మెళకువ అవసరం. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పనిభావం అధికమవుతుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనసును వ్యాకుల పరుస్తాయి. 
 
వృశ్చికం : కిరాణా, ప్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధైర్యంగా మీ ప్రయత్నాలు సాగించండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయటా ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తుంది. 
 
ధనస్సు : అతిథి మర్యాదలు, బాగుగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. సంఘంలో ప్రతిష్టలు పెరుగుతాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. 
 
మకరం : పట్టుదలతో ముందుకు సాగండి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మిత్రులను కలుసుకుంటారు. 
 
కుంభం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. గత తప్పిదాలు పునరావృతంకాకుండా జాగ్రత్త వహించండి. వృత్తుల వారికి బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగలుగుతారు. 
 
మీనం : ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశానంతత చేకూరుతుంది.