సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (10:01 IST)

ఆదివారం మీ రాశిఫలితాలు : ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు..

మేషం: గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి, పారిశ్రామిక రంగంలోని వారికి పనివారితో సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉపాధ్యాయులు నూతన ఆలోచనల

మేషం: గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి, పారిశ్రామిక రంగంలోని వారికి పనివారితో సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు.
 
వృషభం: వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు తోటివారితో మెలకువ అవసరం. ముందుగా ఊహించిన ఖర్చులు కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఏ మాత్రం ఉండవు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోగతి ఉండదు. చేతి వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. చేతి వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది.
 
మిథునం: నూతన వ్యాపారాల్లో భాగస్వామికులను చేర్చుకునే విషయంలో పునరాలోచన ఎంతో మంచిది. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమిస్తే తమ లక్ష్యం సాధించగలరు. మీ ఆంతరంగిక విషయాలు, ప్రయత్నాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. ప్రేమికుల మధ్య ఇతరుల వల్ల విబేధాలు తలెత్తుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
కర్కాటకం: కిరాణా, ఫ్యాన్సీ, పండ్ల, పూల వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వటంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి. ఖర్చులు అధికం అవుతాయి.
 
సింహం: విద్యార్థులకు ఏకాగ్రతా లోపం వల్ల చికాకులు తప్పవు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. సంఘంలో మీ మాటకు గౌరవం, ఆమోదం లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. ఉద్యోగస్తుల విధి నిర్వహణలో సమర్థత కనబరచి, అధికారుల గుర్తింపు పొందుతారు.
 
కన్య : నిరుద్యోగులకు ఉపాధి పథకాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహన ఛోదకులకు చికాకులు తప్పవు. మీ ఆలోచనలు పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెలకువ వహించండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధన వ్యయం విషయంలో మెలకువ వహించండి. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి.
 
తుల : ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది. మీ ఉన్నతిని చాటుకునేందుకు ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. చేపట్టిన పనిలో ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన మార్పులుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వస్త్రాలు, గృహోపకరణాలు అమర్చుకుంటారు.
 
వృశ్చికం: మీ కుటుంబీకుల సూటిపోటి మాటల వల్ల మనస్తాపానికి గురవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాలలోని వారికి లాభదాయకం. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులౌతారు. కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
ధనస్సు: ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. మీ అజాగ్రత్తవల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. గృహంలో ఒక శుభకార్యం చేయాలనే ఒక ఆలోచన స్ఫురిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి అంగీకారం, సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
మకరం: ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీరు చేపట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొన్నా జయం మిమ్మల్ని వరిస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కుంభం : కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులౌతారు. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మీనం: ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. క్రయ విక్రయ రంగాలలోని వారికి అనుకూలత. ప్రేమికులకు స్థిరచిత్తం అవసరం. ధనం వృధాగా వ్యయం కావటం మినహా పెద్దగా ఫలితం ఉండదు. స్త్రీలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుట పడతారు.