శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (08:42 IST)

ఆదివారం (04-03-18) దినఫలాలు : దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు...

మేషం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలు వాయిదా పడుతాయి. స్త్రీలకు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. ప

మేషం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలు వాయిదా పడుతాయి. స్త్రీలకు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులు, విద్యుత్ సమస్యలు అధికమవుతుంది.
 
వృషభం: పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. విద్యార్థులకు అధిక శ్రమ అవసరం. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మిథునం: మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రత్యర్థుల పట్ల కొంత మెలకువగా ఉండటం మంచిది. ముందుగానే ధనం సర్దుబాటు చేసుకోవటానికి యత్నించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం: మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదు. భాగస్వామిక సమావేశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ప్రేమికుల తీరు పెద్దలకు సమస్యగా మారుతుంది. వృత్తి విషయాల్లో గోప్యంగా ఉండటం మంచిది. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తికానరాదు.
 
సింహం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వర్టర్, ఏసీ మెకానికల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మాట్లాడలేని చోట మౌనం వహించండి మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య: భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా ముగుస్తాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఓర్పు, పట్టుదలతోనే మీ లక్ష్యం సాధించగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎవరికీ పెద్ద మొత్తంలో ధనసహాయం చేయడం మంచిది కాదు.
 
తుల : వ్యాపారులకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంతమంది మాటతీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం: కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
ధనస్సు: శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు తోటివారితో విందు, వినోదాలలో పాల్గొంటారు. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు తొలిగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మకరం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లో వారిలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయాల్సి వుంటుంది.
 
కుంభం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. నూతన వ్యాపారాలు చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మిక సమస్యలు తప్పవు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి.
 
మీనం: కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. కుటుంబీకులు గురించి పెద్దలతో చర్చిస్తారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.