మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (08:44 IST)

06-04-2018 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. బంధువుల రాకతో ఆకస్మిక..?

మేషం : కుటుంబంలోను, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని, పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆ

మేషం : కుటుంబంలోను, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని, పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా మిమ్మల్ని మీరు బలపరుచుకుంటారు. 
 
వృషభం: ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
మిథునం: సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. మీ సంతానం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
కర్కాటకం: ఖాదీ, చేనేత, కలంకారీ, నూలు వస్త్ర వ్యాపారులు లాభసాటిగా వుంటాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. వాణిజ్య వ్యాపార రంగాలవారు ఒకడుగు ముందుకు వేస్తారు. 
 
సింహం : కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. వస్తువులు పోవడానికి ఆస్కారం వుంది. అలౌకిక విషయాల పట్ల ఇష్టం పెరుగుతుంది. తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. కొత్త పనులు ప్రారభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. 
 
కన్య: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. కొంతమంది ముఖ్యమైన విషయాల్లో మిమ్మల్ని సంప్రదిస్తారు. న్యాయ, కళా, రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. 
 
తుల: ఆర్థిక లావాదేవీలు, స్నేహపరిచయాలు విస్తరిస్తాయి. ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభిస్తారు. సోదరీ సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం: నమ్మినవారే మోసం చేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. మీరు తలపెట్టిన పనులు కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. గృహ నిర్మాణాల్లో స్వల్ప అడ్డంకులు, ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: ఊహించని ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానిక్ రంగాలవారికి అనుకూలం. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి వుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
మకరం: కొంతమంది మీ నుంచి ధన సహాయం కోరవచ్చు. పారిశ్రామిక, కార్మికులలో నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. 
 
కుంభం: పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించండి. వృత్తి వ్యాపార రంగాల్లో సహచరుల మద్దతు లభిస్తుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
మీనం: సోదరీ, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కొంటారు. రుణ ఒత్తిడి, రావలసిన ధనం అందకపోవడం వల్ల ఒకింత ఆందోళన తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు. చిన్నతరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు.