శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (09:05 IST)

మంగళవారం (03-04-18) మీ రాశిఫలితాలు - ఆధ్యాత్మిక చింతన...

మేషం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఒక ప్రకటన పట్ల ఆకర్షితు

మేషం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. 
 
వృషభం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి శుభం చేకూరుతుంది. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. కోర్టు వ్యవహారాల్లో మెలకువ వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మెళకువ వహించండి. 
 
మిథునం: ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు చక్కగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. గతకొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు. ప్రతీ విషయంలోను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
 
సింహం: ఆర్థికంగా పురోగమిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు. నిరుద్యోగులకు అవకాశాలు చేజారిపోయే ఆస్కారం వుంది. సంఘంలో మీ మాటపై గౌరవం, నమ్మకం పెరుగుతాయి. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
కన్య: ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక ఫలిస్తుంది. మీ సంకల్పసిద్ధికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. రాజకీయ నాయకులు అధికంగా ఆలోచించడం వల్ల ఆందోళనకు గురౌతారు. ఏజెంట్లు, బ్రోకర్లు, రిప్రజెంటేటివ్‌లకు మిశ్రమ ఫలితం.
 
తుల: దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరణా రంగాల్లో వారికి అనుకూలం. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది.
 
వృశ్చికం: ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల దేనిలోను ఏకాగ్రత వహించలేరు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా వుంటాయి. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు: స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు.
 
మకరం: ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించడం వల్ల మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది.
 
కుంభం: రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. విలాస జీవితాన్ని గడుపుతారు. ముందు చూపుతో వ్యవహరించండి. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. 
 
మీనం: ఆర్థికపరమైన అనుకూలతలు కొనసాగుతాయి. అదనపు భారాలను వాయిదా వేయడం మంచిది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి, చికాకులు వంటివి తప్పదు. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల మధ్య సంబంధబాంధవ్యాలు బాగుగా ఉంటాయి.