మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (08:55 IST)

శనివారం (31-03-2018) మీ దినఫలాలు ... కుటుంబ సమస్యలు చక్కగా...

మేషం: స్త్రీలు రచనా వ్యాసాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వ్యాపారంలో కొంతమంది తప్పుదోవ పట్టించే ఆస్కారం

మేషం: స్త్రీలు రచనా వ్యాసాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వ్యాపారంలో కొంతమంది తప్పుదోవ పట్టించే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. రవాణా రంగాల్లో వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. నూనె, మిర్చి, కంది స్టాకిస్టు వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. 
 
మిథునం : సర్టిఫికేట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రైవేట్, పబ్లిక్ రంగాల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. మిత్రులను నమ్మటం వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం: స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకు అధికమవుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే సూచనలున్నాయి. సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు తలెత్తగలవు.
 
సింహం : బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనుకోని విధంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రేమికులకు పెద్దల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. మీకు దగ్గర వున్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
కన్య: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
తుల: ఆర్థికస్థితి ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు. చేపట్టిన పనులు కొంత ఆలస్యమైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం: శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రాజకీయ రంగాల్లో వారికి అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు వంటివి తప్పవు.
 
మకరం: ఆడిట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రతి విషయంలోను ఏకాగ్రత అవసరం. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు.
 
కుంభం: రిప్రజెంటేటివ్‌లు అతికష్టం మీద టార్గెట్ పూర్తి చేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. తోటల రంగాల వారికి దళారీల నుంచి ఒత్తిడి అధికంగా వుంటుంది. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
మీనం: ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్లు త్వరలోనే అనుకూలించగలవు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోరు. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి.