మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (09:15 IST)

గురువారం (05-04-2018) దినఫలాలు - దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత...

మేషం: కొంతమంది ఆర్థిక సహాయం అర్ధిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు. కార్మికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పారిశ్రామికులకు విద్యుత్‌లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. పురోహితులకు, వృత్తులలో వారిక

మేషం: కొంతమంది ఆర్థిక సహాయం అర్ధిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు. కార్మికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పారిశ్రామికులకు విద్యుత్‌లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. పురోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చే కాలం. 
 
వృషభం: ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం. ధన వ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. బాధ్యతలు నెరవేర్చి ప్రశంసలు పొందుతారు. 
 
మిథునం: పాత వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతుంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు.
 
కర్కాటకం: ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. 
 
సింహం: విద్యుత్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. చదువు, వ్యాపారాలపై దృష్టి పెడతారు. రుణం పూర్తిగా తీర్చి తాకట్లు విడిపించుకుంటారు. మధ్యవర్తిత్వం వహించడం వలన సమస్యలను ఎదుర్కొంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
కన్య: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. కుటుంబీకుల కోసం నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రియతముల పట్ల ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తుల వారికి బాధ్యతలు పెరుగును. వెండి, బంగారు, లోహ, రత్న వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
తుల: ఏకపక్షంగా వ్యవహరించవద్దు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులు మానసికాందోళనకు గురవుతారు. 
 
వృశ్చికం: అదనంగా వచ్చే ఆదాయం సంతృప్తినిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో మీ శ్రమ వృధా కాదు. చిన్నతరహా పరిశ్రమలలోని వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్కుంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. 
 
ధనస్సు: ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. కొంతమంది ముఖ్యమైన విషయాల్లో మిమ్మల్ని సంప్రదిస్తారు. వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. రుణబాధలు వంటివి తీరగలవు.
 
మకరం: వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడి తప్పవు. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. బిల్డర్లకు చికాకులు తప్పవు.   
 
కుంభం: ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. నిర్మాణ పథకాల్లో సంతృప్తి కానవచ్చును. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో దూకుడు తగదు. అనుకున్న నిధులు చేతికి అందకపోవచ్చు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.
 
మీనం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినా జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి, వాహన యోగం పొందుతారు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రత్యర్థుల తీరు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్త్రీల ఆరోగ్యంలో జాగ్రత్తలు వహించండి.