ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (16:03 IST)

12-09-2019- గురువారం మీ రాశి ఫలితాలు

మేషం: అకాల భోజనం, శరీర శ్రమ వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదుర్కుంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేక పోతారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు.
 
వృషభం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించి అనుభవం గడిస్తారు.
 
మిధునం: బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో మెళకువ వహించండి. స్త్రీల కోర్కెలు నెరవేరకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడతారు. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం.
 
సింహం: స్త్రీలకు టి. వి ఛానెళ్ళ నుంచి ఆహ్వానాలు, సమాచారం అందుతుంది. ఎగుమతి, దిగుమతి, ఆహార ధాన్యాల వ్యాపారాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. కుటుంబీకులతో సంభాషించటానికి కూడా తీరిక ఉండనంత బిజీగా ఉంటారు.
 
కన్య: వస్త్ర, బంగారం, ఫాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. చిన్నారులకు విలువైన కానుక లందిస్తారు. ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. స్త్రీలకు ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, త్రిప్పుట తప్పవు. మీ సూచనకు సృజనాత్మక శక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
తుల: వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కార్మికులు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురికాకండి. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
 
వృశ్చికం: వ్యవసాయ, తోటల రంగాల వారికి పంట దిగుబడి ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. దీర్ఘకాలిక ఒప్పందాలకు శ్రీకారం చుట్టండి. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరమని గమనించండి. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు.
 
ధనస్సు: కోళ్ల, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఊహించని సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గ్రహించండి. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. విద్యుత్ లోపం వల్ల పారిశ్రామిక రంగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
మకరం: ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తు వేసి ముందుకు సాగండి. తాఫీ పనివారికి ఆందోళనలు తప్పవు. ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు, చికాకులు ఒక కొలిక్కి వస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
కుంభం: తరుచు సభలు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థుల్లో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. కళాకారులకు, అంతరిక్ష పరిశోధకులకు, శాస్త్రజ్ఞులకు, దైవజ్ఞులకు మంచి గుర్తింపు లభించంగలదు. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
 
మీనం: రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. తాకట్టు వస్తువులను విడిపిస్తారు. విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. సినిమా, కళా రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.