శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

14-10-2019 గురువారం రాశిఫలాలు - ధనం విరివిగా వ్యయం..

మేషం: ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో కలిసి విందు, వేడుకలలో పాల్గొంటారు. మీ శ్రీమతిని సలహా అడగటం శ్రేయస్కరం. తోటివారి సహకారం వల్ల మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
 
వృషభం: మీ సంతానంతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనిలో సమయపాలన, పరస్పర అవగాహన తప్పనిసరిగా ఉండాలి. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గతవిషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది.
 
మిధునం: కీలక సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. దైవ కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. దైవబలంతో కష్టాలను అధికమిస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.
 
సింహం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీల మతిమరపు నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. ప్రయాణాలలో జయం చేకూరుతుంది.
 
కన్య: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహన లోపం. మీ ముక్తసరి పలకరింపు బంధువులను నిరుత్సాహపరుస్తుది.
 
తుల: కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. విద్యార్థులు బయటి తినుబండారాలు భుజించుటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఆడంబరాలు, వ్యసనాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇష్ట దైవాన్ని స్తుతించినా సమస్యలు పరిష్కారమవుతాయి.
 
వృశ్చికం: మీ సంకల్పసిద్ధికి నిరంతరశ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల మరచిపోయే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అనురాగ వాత్యాల్యాలు పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. లౌక్యంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ధనం బాగా అందుటవలన ఏ కొంతయినా నిల్వచేయ గలుగుతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
 
మకరం: సినిమా, కళాంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ధనం చేతికందుతుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడతారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటు చేసుకుంటాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కుంభం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. విఘ్నాలను అధిగమించే ఆలోచనలు చేయవలసి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అందిరతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
మీనం: పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గృహ నిర్మాణరంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. అతిథి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.