18-03-2020 బుధవారం మీ రాశిఫలాలు - గాయత్రి మాతను ఆరాధిస్తే జయం

daily astrology logo
రామన్|
మేషం : లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధనవయ్యం విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతోపాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకుసాగవు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం : స్థిరాస్తి క్రయ విక్రయాల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగాలి. గతంలో చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. మీ పెద్దల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.

మిథునం : చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం.

కర్కాటకం : పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. నూతన టెండర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహం : స్త్రీలకు ఖర్చులు విషయంలో మెళకువ అవసరం. నూతన వ్యాపారాలు, పరిశ్రమలు, సంస్థలకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు విశ్రాంతి లోపం. శ్రమ అధికమవుతాయి. ఏ విషయంలోనూ మిత్రులపై ఆధాపడటం మచిందికాదని గమనించండి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.

: ఆడిట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిశ్చితార్థాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం, గృహోపకరణాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బిల్లులు చెల్లిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. మీ ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకండి.

: కొంతమంది మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. స్త్రీలు, విలాసవస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి.

వృశ్చికం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, బదిలీలు త్వరలో అనుకూలించగలవు. స్త్రీలు, శుభకార్యాలు, వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు.

ధనస్సు : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. రిప్రజెంటేటివ్‌లు అతికష్టంమ్మీద టార్గెట్ పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. స్థిరచరాస్తుల కొనుగోళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ వాయిదాలు, ఇతర బకాయిల సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగస్తులకు ప్రతి విషయంలోనూ ఏకాగ్రత అవసరం.

మకరం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు తగ్గించుకునే మీ యత్నం అనుకూలించదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయతముల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. తీర్థయాత్రలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం.

కుంభం : గృహంలో ఒక శుభకార్యం కోసం యత్నాలు మొదలపెడతారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుగా వ్యవహరిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.

మీనం : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి వ్యవహారంలో మీరే సమీక్షించుకోవడం శ్రేయస్కరం. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.దీనిపై మరింత చదవండి :