15-03-2020 ఆదివారం మీ దినఫలాలు - ఆదిత్య హృదయం చదివితే సర్వదా...

daily astrology logo
రామన్| Last Updated: ఆదివారం, 15 మార్చి 2020 (10:27 IST)
మేషం : వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు తగవు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. మీ సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులకే లాభిస్తుంది. వృత్వారికి ఆదాయాభివృద్ధి. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, పదవులకు స్వస్తి పలుకుతారు. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.

వృషభం : మీ సహాయం పొందినవారే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. పత్రిక సిబ్బందికి మమార్పులు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ అవసరం.

మిథునం : మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. సోదరీ, సోదరులతో ఆస్తి పంపకాలను ప్రస్తావిస్తారు. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వృత్తుల వారికి గుర్తింపు, ప్రజాసంబంధాలు బలపడతాయి. శ్రమాధిక్యత, వ్యవహారాల్లో ప్రతికూలతలు అధికం.

కర్కాటకం : ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలుకాగలవు. విశ్రాంతి లోపం, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పుణ్యకార్యాలకు సహాయం అందిస్తారు. నూతన కాంట్రాక్టరులు, లీజు గడువు
పొడగింపులకు అనుకూలం.

సింహం : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు అధికం. పొగడ్తలు, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. స్త్రీలు ప్రతిభ చాటుకునే అవకాశం వస్తుంది. గృహ నిర్మాణాలకు ప్లాను ఆమోదంతో పాటు రుణాలు మంజూరవుతాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త అంశాలు చోటుచేసుకుంటాయి. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధికమిస్తారు..

: ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అభ్యంతరాలెదురవుతాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. వైద్య రంగాల వారు క్లిష్టమైన ఆపరేషన్లు సమర్థంగా నిర్వహిస్తారు. పెద్దమొత్తం ధనసహాయంలో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు.

తుల : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమ. మీ పనులు మందకొడిగా సాగుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు చికాకులు తప్పవు. ఏ పని సక్రమంగా సాగక విసుగు చెందుతారు. యాదృచ్ఛికంగా ఆలయాలను సందర్శిస్తారు.

వృశ్చికం : సిమెంట్, స్టాకిస్టులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి అందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు.

ధనస్సు : అధ్యాపకులకు పురోభివృద్ధి. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మెలకువ వహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనం వ్యయం అవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం : ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. కొన్ని విలువైన వస్తువుల అనుకోకుండా కొనుగోలు చేస్తారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పాత సమస్యలకు చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారిపెట్టే ఆస్కారం ఉంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం : ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచనలు ఉంటాయి. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. రహస్యాన్ని దాచలేని మీ బలహీనత ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు. శ్రమ అధిం. లక్ష్య సాధనకు విద్యార్థులు మరింతగా కృషి చేయాలి.

మీనం : వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. అనుకున్న పని మొదలెట్టే సమయానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఏజెన్సీలు, లీజు, గడువు పొడగింపులకు అనుకూలం. విద్యార్థినిల్లో ఏకాగ్రత, స్థిరత్వం నెలకొంటాయి. అయినవారి నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు.దీనిపై మరింత చదవండి :