బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-03-2020 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజిస్తే శుభం

మేషం : కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు శ్రేయోదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. విద్యార్థులలో తొందరపాటుతనంకూడదు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. రావలసిన బకాయిలు వాయిదాపడతాయి. మొక్కుబడులు తీర్చుకుంటారు. 
 
వృషభం : స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముంగించుకుంటారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
మిథునం : విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు సంస్థల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. 
 
కర్కాటకం : కోళ్లు, మత్స్యు రంగాల్లో వారికి చికాకులు తప్పవు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో మెళకువ అవసరం. 
 
సింహం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఆశాజనకం ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాల్లో వారికి కలిసిరాగలదు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. హోటల్, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు అనుకూలం. 
 
కన్య : వస్త్ర, బంగారు, వెండి, లోప వ్యాపారస్తులకు శుభదాయకం. విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ప్రియతములలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
తుల : కాంట్రాక్టర్లకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి. కొంతమంది మీ నుంచి ధనసహాయం అర్థిస్తారు. స్త్రీలు ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించడం మంచిది. అధికంగా శ్రమించి అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. స్త్రీలు నూతన పరిచయస్తుల విషయంలో అప్రమత్తంగా మెలగటం క్షేమదాయకం. 
 
వృశ్చికం : ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయాల్లో వారు మార్పులను కోరుకుంటారు. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆందోళన అధికమవుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. 
 
ధనస్సు : వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల త్వరితగతిన పూర్తిచేస్తారు. కీలస సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. శత్రువులు మిత్రులుగా మారుతారు. 
 
మకరం : చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం : ముఖ్య విషయాల్లో భాగస్వామి సలహా పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మీనం : కోర్టు వ్యవహారాలలో లాయర్లు క్లయింట్‌ల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. పెద్దల నుంచి ఆస్తులు విక్రయిస్తరాు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.