మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

17-03-2020 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల...

మేషం : పెద్దల నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. చేతివృత్తుల వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్వయంకృషితో అభివృద్ధి చెందుతారు. 
 
వృషభం : విద్యార్థులకు ఉన్నత చదువుల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. బంధుమిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులే అధికమవుతాయి. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులో జాప్యం. పనివారలతో సమస్యలను ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరన్న వాస్తవం గ్రహించండి. వ్యాపారాలు, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. 
 
కర్కాటకం : భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని విషయాలు మరచిపోదాముకున్నా సాధ్యంకాదు. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. స్త్రీల అభిప్రాయాలకు ఆశించినంత స్పందన ఉండదు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. రావలసిన ధనం వాయిదాపడుతుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు, నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కన్య : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీ శ్రీమతికి మినహా ఇతరులకు తెలియనీయకండి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పత్రికా సిబ్బందికి మినహా ఇతరులకు పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. 
 
తుల : అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. రావలసిన ధనం వాయిదాపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. 
 
వృశ్చికం : గృహ మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. పోస్టల్, కొరియర్ రంగాలవారికి ఒత్తిడి, తిప్పట అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తి. పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, పనిభారంతో సతమతమవుతారు. గృహానికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు వాదోపవాదాలకు దిగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
మకరం : ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. 
 
కుంభం : ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉంటాయి. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. కంప్యూటర్ రంగాలవారికి చికాకులు తప్పవు. దైవసేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
మీనం : మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులరాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అవసరం.