సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pa raman
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (16:54 IST)

28-10-2018 - ఆదివారం దినఫలాలు - గౌరవ మర్యాదలకు భంగం...

మేషం: మత్య్స, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ధనం సకాలంలో అందక నిరుత్సాహం చెందుతారు. మీరు చేసే కృషి వలన మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం: దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పండ్లు, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
మిధునం: మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారీ సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహనకుదరదు.
 
కర్కాటకం: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులతో పరిచయాలు అధికమవుతాయి. మెుండి బాకీలు సైతం వసూలు కాగలవు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. బంధువుల రాకతో అతిధ మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.  
 
సింహం: మీ మంచి కోరుకునేవరు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోతాయి. పెరిగన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. బంధువుల రాక వలన తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.  
 
కన్య: కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైనకాలం. హోటల్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. పిల్లల కోసం, ప్రియతముల కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు. మీ ఆవేశం, అవివేకం వలన వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రేపటి గురించి అధికంగా ఆలోచిస్తారు. 
 
తుల: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పాతమిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. వివాదస్పద విషయాలకు దూరంగా ఉండండి.   
 
వృశ్చికం: కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. ఒకవేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మెుదలెడతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. స్నేహ బృందాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.    
 
ధనస్సు: రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ సంతానం మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఫ్యాన్సీ, కిరణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును.  
 
మకరం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాకంతో వస్త్ర, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెళకువ అవసరం. మనుష్యుల మనస్థత్వం తెలిసి మసలుకొనుట మంచిది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.  
 
కుంభం: రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.  
 
మీనం: స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వలన ఆందోళనలకు గురవుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.