సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : బుధవారం, 12 జులై 2017 (22:23 IST)

మీ రాశి ఫలితాలు(13-07-2017)... ధన లాభములు, వాహన సౌఖ్యం...

మేషం : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆధ్మాతిక, అలౌకిక విషయాల

మేషం : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆధ్మాతిక, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. 
 
వృషభం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించినప్పుడు మెళకువ చాలా అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి.
 
మిథునం: ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తుల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రిప్రజెంటేటివ్‌లకు వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. వాహనం కొనుగోలుకై చేయు యత్నాలు వాయిదాపడతాయి.
 
కర్కాటకం: నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినుల్లో చురుకుదనం కానవస్తుంది. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అప్రయత్న ధనలాభములు, వాహనసౌఖ్యం, కుటుంబ సౌఖ్యం పొందుతారు.
 
సింహం : ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాకుండా చూసుకోండి. స్త్రీలకు ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
 
కన్య : మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ది పొందాలని యత్నిస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
తుల : హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా మొండిధైర్యంతో ముందుకుసాగి పూర్తి చేస్తారు.
 
వృశ్చికం : శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పైఅధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రేమానుబంధాలు, ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. శత్రువులపై విజయం సాధిస్తారు.
 
ధనుస్సు : నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రుణయత్నం ఫలించిన ధనం అందుతుంది. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త. దైవ కార్యంలో పాల్గొంటారు. సహోద్యోగుల తప్పిదాలకు మీరే బాధ్యత వహించవలసివస్తుంది.
 
మకరం : వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. దైవ కార్యంలో పాల్గొంటారు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు వాయిదా పడతాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. 
 
కుంభం : ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయాల్లో వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
మీనం : ప్రింటింగ్ రంగాల్లో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. టెక్నికల్, వైజ్ఞానికరంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
సాయిబాబాను రావి సమిధలతో పూజిస్తే శుభం కలుగుతుంది.