శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (19:59 IST)

గరుడాళ్వార్‌ దర్శనంతో నాగదోషాలు పటాపంచలవుతాయ్!

Garuda Purana
పురాణాల ప్రకారం గరుడ భగవానుడికి గరుడాళ్వార్ అనే పేరు వుంది. ఈ గరుడ స్వామిని వారంలో ఏ రోజులలో దర్శిస్తే కొన్ని లాభాలను పొందవచ్చు. గరుడ భగవానుడు తిరుమల వాహనం. పక్షులకు రాజు అయిన గరుడను ఒక శుభ రూపంగా భావిస్తారు.
 
దేవతల లోకం నుండి అమృతాన్ని తెచ్చిన ఘనత ఆయనది. గరుడుడిని రోజూ ఆలయంలో లేదా ఇంట్లో పూజిస్తే నాగదోషం తొలగిపోతుంది. చర్మ వ్యాధులు నయమవుతాయి. వివాహిత స్త్రీలకు జ్ఞానం, శక్తితో నిండిన సంతానం కలుగుతుంది. 
 
వ్యాధులు తొలగిపోతాయి. నారాయణ స్వామి ఆలయాలకు వెళ్లేవారు గరుడ పూజ చేసిన తర్వాతే స్వామిని పూజించాలని వైష్ణవ ఆగమ శాస్త్రం చెప్తోంది. ఆలయంలో కుంభాభిషేకం జరిగినప్పుడు గరుడుడు వచ్చి ప్రదక్షిణ చేస్తేనే కుంభాభిషేకం పూర్తవుతుందని విశ్వాసం వుంది. 
 
వారంలో ఏ రోజున గరుడాళ్వార్‌ను దర్శిస్తే ఏంటి ఫలితమో తెలుసుకుందాం.. 
ఆదివారం: అనారోగ్యం తొలగుతుంది.
సోమవారం: కుటుంబం అభివృద్ధి చెందుతుంది.
మంగళవారం: శారీరక బలం పెరుగుతుంది.
బుధవారం: శత్రువుల వేధింపులు తొలగిపోతాయి.
గురువారం: దీర్ఘాయువు పొందవచ్చు.
శుక్రవారం: లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
శనివారం: మోక్షప్రాప్తి కలుగుతుంది.