గురుని వల్ల కలిగే దోషాలు.. శాంతి మార్గాలు!
బృహస్పతి (గురువు) విద్యా, ధనములకు కారకుడు, స్థిరాస్తి తిరిగి పోవుట, అపనిందలు, అయినవారు శత్రువులగుట, కాలేయము, ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు మొదలగునవి గురుని బలము లోపించినప్పుడు జరుగును.
గురుధ్యానం
తేజోమయం, శక్తి త్రిశూల హస్తం, సురేంద్రసం సేవిత పాదపద్మమ్ |
మేదానిథింమత్స్యగతం, ద్విబాహు గురుంస్మరేన్మానసపంకజేహమ్ ||
దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతమ్ ||
గురుమంత్రం
ఓం హ్రీం శ్రీం గ్లౌం బృహస్పతయే వీంఠః; ఐంఠః స్వాహా ||
గురుయంత్రం
10 5 12
1 9 7
6 13 8
గురువారం మధ్యాహ్నం గురుహోరలో అనగా 1-2 గంటలకాలం మధ్యన ఈ యంత్రం ధరించాలి. ప్రతినిత్యం ఉదయం స్నానం చేసి శుచిగా గురు ధ్యానం 14సార్లు పఠించాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైవిధంగా ఈ యంత్రం పూజించి ధరించాలి. 7వారాలు శనగలు దానం ఇవ్వాలి. గురువారం రోజు రాత్రి భోజనం, మంచంపై పరుండటం, సంభోగము, అభ్యంగనము యితరచోట్ల భోజనము, మాంసాహారము, మత్తుపదార్థములు ఉపయోగించుట, జీవహింస, వాదోపవాదములు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.