గురువారం, 10 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (13:57 IST)

మీ ఇంట్లో కనకవర్షం కురవాలంటే.. ఒకే ఒక మందార పువ్వు చాలు! (video)

Hibiscus, Mascara
మీ ఇంట్లో కనకవర్షం కురవాలంటే.. ఒకే ఒక మందార పువ్వు చాలు అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. శుక్ర యోగంతో సిరిసంపదలు చేకూరుతాయి. శుక్రదశ వుంటే ఆర్థికాభివృద్ధి వుంటుది. శుక్రదశ కారణంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. 
 
అదృష్టం మనవెంట వుండాలంటేయయ మందార పువ్వుతో ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సాధారణంగా, మందార పువ్వుకు పాజిటివ్ ఎనర్జీ అధికం. ముఖ్యంగా మందార పువ్వు లోపల ఉండే పుప్పొడికి ఆ శక్తి ఉంటుంది. ముందుగా మందారపువ్వులోని పుప్పొడిని మాత్రమే తీసుకోవాలి. ఈ పుప్పొడి రేణువులను ఒక చిన్న డబ్బాలో ఉంచండి. 
 
మందార పువ్వు పుప్పొడి రేణువులతో కొద్దిగా యాలకుల పొడిని మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి కాటుకలా తయారుచేసుకోవాలి. అంటే నుదుటిపై ధరించేందుకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు నీటిని పోయవద్దు. నెయ్యి పోసి సిరాలా తయారుచేసి, పూజగదిలో ఉంచి, ఇలవేల్పు, మహాలక్ష్మి, శుక్ర భగవానుని స్మరిస్తూ ప్రార్థించండి. ఒక దీపాన్ని వెలిగించాలి.
 
ఆ తరువాత, మీరు ప్రతిరోజూ ఈ కాటుకను నుదిటిపై ఈ తిలకం పెట్టుకోవాలి. ఇలా చేస్తే సంపద, అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కాటుక ఇది నలుపు రంగులో ఉంటుంది. దీన్ని నుదుటిపై ధరించడం ద్వారా  పాజిటివ్ ఎనర్జీ లభించింది. దురదృష్టం దూరమవుతుంది. 
 
రుణ సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ఈ తిలకం 48 రోజుల పాటు వాడుకోవచ్చు. జీవితంలో అభివృద్ధి వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.