శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (17:42 IST)

రెండు చేతులతో తల గోక్కుకుంటున్నారా.? నోట్లను ఎంచేటప్పుడు వేలికి ఎంగిలి తాకితే లక్ష్మీదేవి?

సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలా? లక్ష్మీదేవి మీ ఇంటనే కొలువుండాలా? అయితే ఈ పద్ధతులు పాటించండి. ఆ దేవదేవి మీకు ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇంతకీ లక్ష్మీదేవి మన ఇంట వసించాలం

సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలా? లక్ష్మీదేవి మీ ఇంటనే కొలువుండాలా? అయితే ఈ పద్ధతులు పాటించండి. ఆ దేవదేవి మీకు ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇంతకీ లక్ష్మీదేవి మన ఇంట వసించాలంటే ఏం చేయాలంటే?.. శాస్త్రాల ప్రకారం కొన్ని సమయాల్లో నిద్రపోకూడదు.

వేకువజామున నిద్రపోరాదు. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. వేకువ జామును ఉషత్కాలం అంటారు. ఆ సమయంలో దేవతలు, పార్వతీపరమేశ్వరులు, మహాలక్ష్మీ సంచరిస్తారని.. ఆ సమయంలో నిద్ర నుంచి మేల్కొని శుచి శుభ్రంగా స్నానమాచరించి పూజలు చేసేవారిని వారు అనుగ్రహిస్తారని విశ్వాసం. 
 
అందుకే సూర్యోదయానికి ముందే.. (ఉదయం ఐదు గంటలకు) నిద్రలేవాలని అంటారు. వేకువజాము దేవతా ప్రార్థనకు మంచి కాలం. శుచిగా స్నానమాచరించి.. విభూతి నుదుట ధరించి.. పూజలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పుణ్యఫలం సంపాదించుకోవచ్చు. సూర్యుడు ఉదయించే సమయంలో నిద్రించే వ్యక్తి.. సంపదలను కలిగివున్నప్పటికీ.. అతని నుంచి మహాలక్ష్మి దూరమైపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
అందుకే సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. దైవ ప్రార్థన చేయండి. ఓ దీపం వెలిగించి.. మీ ఇష్ట దేవతను పూజించండి. మీ సంకల్పాన్ని దేవునిముందు ఉంచండి. మీ కోరికలు నెరవేర్చమని కోరుకోండి. ఆ రోజు చేసే పనిని దేవునికి సమర్పించండి. దేవతలను మీ వెంటే ఉండాలని కోరుకోండి... ఇలాచేస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. కార్యసిద్ధి చేకూరుతుంది.  
 
1. సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యుడు ఉదయించాక నిద్రలేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట నివసించదు. 
2. రెండు చేతులతో తలగోక్కోవడం చేయకూడదు. 
3. వంట చేసేటప్పుడు కానీ.. అన్నం వడ్డించేటప్పుడు కానీ రుచి చూడకూడదు. 
4. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి నివసిస్తుంది. 
5. ఇంట్లోని మహిళలకు గౌరవం ఇవ్వాలి. భార్యకు, జన్మనిచ్చిన తల్లికి మర్యాద ఇవ్వాలి. మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఇంట మహాలక్ష్మి నివసిస్తుంది.  
6. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే.. ఓ బౌల్‌లో పువ్వులేసి మధ్యలో దీపమెట్టి గడప దగ్గర ఉంచాలి.  
7. శుచిగా శుభ్రంగా ఉన్నచోటనే నిద్రించాలి. 
8. సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. స్నానమాచరించాలి. 
9. స్నానమాచరించాకే  తినాలి. 
10. నగదుకు ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. దానికి విలువనివ్వాలి. నోట్లను ఎంచేటప్పుడు వేలికి ఎంగిలి అంటించి లెక్కిస్తే.. శ్రీదేవి ఉండదు. 
11. పొయ్యి వెలిగించే ముందు.. అగ్నిదేవుడిని పూజించుకోవాలి. 
12. సాయంత్రం ఆరుగంట సమయంలో భోజనం చేయకూడదు. 
13. పూజా సమయంలో ధ్యాన శ్లోకాలను పఠించాలి. 
14. చీపురు పట్టుకున్న చేతిని శుభ్రం చేసుకున్నాకే ఆహారం తీసుకునే వస్తువులను తాకాలి.
15. శుక్రవారాల్లో పేలు దువ్వడం, గోర్లను కట్ చేయడం.. తెల్లవారున గోళ్లను కట్ చేయడం కూడదు.