మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:21 IST)

నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

పుట్టుమచ్చలు వ్యక్తి యెుక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయనే నమ్మకం ప్రాచీనకాలం నుండి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు పుట్టుమచ్చలు జీవితాన్ని ప్రభావితం చేయడంలో మెుదటిపాత్రను పోషిస్తుంటాయని చాలామంది నమ్ముతుంటా

పుట్టుమచ్చలు వ్యక్తి యెుక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయనే నమ్మకం ప్రాచీనకాలం నుండి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు పుట్టుమచ్చలు జీవితాన్ని ప్రభావితం చేయడంలో మెుదటిపాత్రను పోషిస్తుంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఈ క్రమంలో పుట్టుమచ్చులు ఈ ప్రాంతాల్లో ఉంటే ధనయోగాన్ని పొందుతారని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది.
 
తలపై కుడి భాగంలో, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో వారికి ధనయోగం కలుగుతుంది. అలానే ముక్కు కుడి భాగంలో, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చలు ఉన్నవారికి ఊహించని విధంగా ధనవంతులవుతారు. 
 
మెడ ముందు భాగంలో, కుడి భుజం పైన, పొట్టపైన, హృదయ స్థానంలో, మోచేతి పై, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలిపై పుట్టుమచ్చలు ఉన్నవారు శ్రీమంతులవుతారు. ఈ ప్రాంతాల్లో ఉన్న పుట్టుమచ్చల వలన కష్టపడడం వలన గానీ లేదా కాలం కలిసిరావడం వలన గానీ ధనయోగం కలుగుతుందని చెబుతున్నారు.