శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : బుధవారం, 31 మే 2017 (14:52 IST)

జూన్ నెల రాశి ఫలితాలు... దంపతులు ఎలా ఉండాలంటే...

ఈ మాసం యోగదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. యత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యవహారానుకూలత, కార్యసాధనలో జయం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం భవిష్యత్

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం యోగదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. యత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యవహారానుకూలత, కార్యసాధనలో జయం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ వహిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బంధుత్వాలు, ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులకు ఇది సరైన తరుణం కాదు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. వృత్తి నైపుణ్యం మెరుగుపడుతుంది. వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ప్రయాణంలో జాగ్రత్త. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దు. బాధ్యతలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. అధికారులకు స్థానం చలనం, హోదా మార్పు. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3, పాదాలు. 
బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం అందుతుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహించండి. యత్నాలు సామాన్యంగా సాగుతాయి. విలువైన పత్రాలు, నగదు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఒక సమాచారం. ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను ధీటుగా ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వృత్తుల వారికి ఆశాజనకం. పూర్వ విద్యార్థులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
లౌక్యంగా పనుల చక్కబెట్టుకోవాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఎవరి సహాయం ఆశించవద్దు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కొంటారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను కొంతమేరకు భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే సాగించండి. వృత్తుల వారికి సామాన్యం. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు. జూదాలు, పందాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. అప్రమత్తంగా ఉండాలి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. పనులు వేగవంతమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఖర్చులు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. రచయితలు, కళాకారులకు ఆదరణ లభిస్తుంది. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. అవసరానికి ధనం అందుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలకు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఆలోపించజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. సొంత నిర్ణయాలు తగవు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. విందులు, చక్కని ఫలితాలు సాధిస్తారు. విదేశీ చదవుల యత్నం ఫలిస్తుంది. ఆధ్యాత్మిక సంస్థలకు సహాయం అందిస్తారు. వివాదాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వొద్దు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులను దారికి తెచ్చుకోలుగుతారు. అభియోగాలు, అనుమానాలు తొలగిపోగలవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆత్మీయుల కోసం బాగా వ్యయం చేస్తారు. సంతానం ఉన్న చదువులపై శ్రద్ధ వహిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. వైద్య, న్యాయవాదరంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. అదనపు బాధ్యతల నుంచి విముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పనులు నిదానంగా పూర్తవుతాయి. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తినైపుణ్యం పెంచుకునే దిశగా శ్రమిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయవ్యయాలు సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కార్యసాధనంలో జయం, ప్రశాంతత పొందుతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. పనులు ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. శుభకార్యంలో పాల్గొంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఆస్తి, స్థిర వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు, పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలు ధీటుగా ఎదుర్కొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అయిన వారికి సాయం అందిస్తారు. శుభకార్యయత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలను అన్వేషిస్తారు. అనుకున్నది సాధించేవరకు శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు పెరిగినా ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు తగిన సమయం. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాల ప్రశాంతంగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహమార్పు యత్నం కలిసివస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు ఉన్నతికి దోహదపడతాయి. అభియోగాలు, విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రావలసిన ధనం కొంత మొత్తం అందుతుంది. రుణ విముక్తులవుతారు. స్థిరాస్తి విక్రయం ఆలోచనను విరమించుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం.