1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (23:27 IST)

కాలభైరవ జయంతి.. బుధవారం కూడా.. మధ్యాహ్నం 12 గంటల వరకు..?

కాలభైరవ జయంతి బుధవారం కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వుంది. కార్తీకమాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి సోమవారం 4 డిసెంబర్ 2023 రాత్రి 9.59 గంటలకు ప్రారంభమైంది. ఇది బుధవారం, డిసెంబర్ 6, 2023 మధ్యాహ్నం 12:37 గంటలకు ముగుస్తుంది.
 
కనుక ఉదయ తిథి ప్రకారం కాల భైరవుని జన్మదినాన్ని బుధవారం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు జరుపుకోవచ్చు. ఈ సమయం కాలభైరవుని ఆరాధనకు అనుకూలమైన సమయం. ఈ రోజున శివయ్య రుద్రావతారమైన కాల భైరవుడు అవతరించినట్లు విశ్వాసం.

ఈ కాలంలో కాలభైరవాష్టకం చదవడం, వినడం చేస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. అలా చేస్తే తనని పూజించిన భక్తులకు కోరిన కోరికలను కాలభైరవుడు నెరవేరుస్తాడని విశ్వాసం. 
 
కాల భైరవుడిని ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తిథిన పూజిస్తారు. అయితే కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథిని కాలభైరవ జయంతిగా పరిగణిస్తారు. అందుకే ఈ సమయంలో కాలభైరవ పూజ విశిష్ట ఫలితాలను అందిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.