సాధారణంగా అందరి ఇంట్లోను బల్లి కనిపిస్తుంటుంది. అది ఇంట్లోకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తుంది. అందువలన ఎవరు కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటిని అంతంగా పట్టించుకోరు. అయితే బల్లి కుడా శకునం పలుకుతుందని, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని పరిశోధనలో చెప్పబడుతోంది. బల్లి చేసే ఒక చిత్రమైన ధ్వనిని అది పలికే శకునంగా భావిస్తుంటారు....