మార్చి 24న మత్స్య జయంతి.. పసుపు రంగు దుస్తులు ధరిస్తే?
మార్చి 24న మత్స్య జయంతి. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన ఈ మత్స్యావతారం ప్రాశస్త్యమైనది. మత్స్యావతారం శ్రీ మహా విష్ణువు మొదటి అవతారం. ఇందులో విష్ణువు పెద్ద చేపగా అవతరించాడు. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం ఉత్తమం.
ఈ రోజున మహావిష్ణువు, లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు ధరించి చందనం ధరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. స్వామికి పువ్వులు, అరటి పండ్లు, పాయసాన్ని, రవ్వలడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి, ఆపై విష్ణువు మత్స్య పురాణం లేదా మత్స్య పురాణాన్ని పఠించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
మత్స్య జయంతి 2023 తేదీ : గురువారం, మార్చి 23, 2023
మత్స్య జయంతి ముహూర్తం సమయం : మార్చి 24 మధ్యాహ్నం 02:40 నుండి 05:07 వరకు
వ్యవధి : 02 గంటలు 26 నిమిషాలు
మత్స్య జయంతి నాడు మత్స్య పురాణం వినడం లేదా చదవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. శ్రీలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.