శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (14:31 IST)

సోమవారం నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?

ముక్కంటి అయిన పరమేశ్వరుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. పరమేశ్వరుడు ముందు దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకోవాలని అంటుంటారు ఆధ్యాత్మిక నిపుణులు. ఇలా వెలిగించిన దీపం వత్తి నుండి వచ్చే పొగ మానవ గుండె స్పందన మెరుగుపరుస్తుంది. సోమవారం రోజు సాయంత్రం పూట పూజ చేయాలి అనుకునే గృహిణీ మహిళలు ఒంటరిగానే కాకుండా భర్తతో కలిసి పూజ చేయడం వలన పుణ్యఫలమే కలుగుతుంది.
 
సోమవారం పూట శివాలయం గానీ, మరేదైనా గుడిలో లేదా మీ ఇంట్లో శివలింగానికి విభూదిని నీటిలో కలిపి అభిషేకం చేసుకోవాలి. ఇలా కాకపోయినా ఏదైనా పండ్ల రసాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు బిల్వ దళాలను ఉంచి పూజించాలి. 
 
ఇలా చేసుకున్న తర్వాత ఓం నమ: శివాయ అంటూ కొన్నిసార్లు ఆ శివయ్యను తలచుకుని చివరిగా హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన ఆ మహేశ్వరుడికి ఎంతో ఇష్టమట. మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.