శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (19:58 IST)

#PhalgunaAmavasya.. సర్పదోషాలు, పితృదోషాలు తొలగిపోవాలంటే?

మనదేశంలో చంద్ర చక్రం మానవ శరీరాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అందువల్ల పౌర్ణమి, అమావాస్యలను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇందులో ముఖ్యంగా ఫాల్గుణ అమావాస్య ప్రత్యేకమైనది. పితృదోషాలను వదిలించుకునేందుకు ఇది అనువైన రోజు. పూర్వీకుల నుండి ఏర్పడిన శాపాల నుంచి విముక్తి పొందవచ్చు. పవిత్ర నదుల ఒడ్డున ఉండే భక్తులు ఈ రోజు సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేయడం మంచిది. 
 
ఇలా నదీ స్నానం, నదీ సమీపాల్లో పితృదేవతలు అర్ఘ్యమివ్వడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా బ్రాహ్మణులకు కూరగాయలు దానం చేయడం, అన్నదానం చేయడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. తద్వారా పితృదేవతలకు మోక్షం సిద్ధిస్తుంది. 
 
శని అమావాస్య రోజున పూజలు చేయడం, ఆహారాన్ని దానం చేయడం, వ్రతాన్ని పాటించడం వల్ల శ్రేయస్సు, విజయం లభిస్తుంది. కాల సర్పదోషాలున్న వారు ఈ రోజున రావి చెట్టుకు పూజ చేయడం మరిచిపోకూడదు. పుట్టల్లో పాలు పోయడం వంటివి తప్పకుండా చేయాలి.