శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శని అమావాస్య.. హనుమ పూజ.. రావి చెట్టు కింద దీపం.,.

ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం అమావాస్య విశేషమైనది. దీనిని ఫాల్గుణ అమావాస్య అంటారు. ఈ రోజున దేవ ప్రతి కార్య మరియు శంకరాచార్య అమావాస్య ఒక్క రోజే వచ్చాయి. అది కూడా శనివారం రావడం విశేషం. పండితులు చెప్పిన దాని ప్రకారం నాలుగు గ్రహాలు కూడా అమావాస్య నాడు వస్తాయి.

సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు కూడా కుంభ రాశిలో వస్తాయి. 12 మార్చి 2021 మధ్యాహ్నం 3:00 గంటలకు అమావాస్య ప్రారంభం అవుతుంది. 13 మార్చి 2021 న ఉదయం 03:52 గంటలతో అమావాస్య ముగుస్తుంది. 
 
ఈ రోజున హనుమంతునికి పూజించడం, రావి చెట్టు వద్ద దీపం పెట్టి ప్రదక్షిణం చేయడం, శమీ పూజ చేయడం, గోవుని పూజించడం లాంటివి చేస్తే శుభం కలుగుతుంది. ఈ శని అమావాస్యకి ప్రత్యేకత వుంది. పితృ దోషం, కాలసర్ప దోషం, అమావాస్య దోషాలు వంటివి ఈ రోజు తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
శనీశ్వర అమావాస్య నాడు పితృదేవతల గురించి మాత్రమే కాకుండా ఆ రోజు శని దేవుని మంత్రం ఉపవాసం చేయడం మంచిది. అలానే నల్ల బట్టలు దానం చేయడం, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, గొడుగు వంటివి దానం చేస్తే దోషాలు పోతాయి.