08-09-2019 నుంచి 14-09-2019 వరకు మీ రాశి ఫలితాలు..(Video)

రామన్| Last Modified శనివారం, 7 సెప్టెంబరు 2019 (20:03 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్తలు వింటారు. గృహం సందడిగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు వేగవంతమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. వ్యవహారాల్లో మెళుకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. బుధ, గురు వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రశంసలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
ఆర్థిక ఇబ్బందులుంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు బలపడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపుల తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. కుటుంబీకుల ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పదవులు దక్కకపోచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. చిత్తశుద్ధిని చాటుకుంటారు. ఖర్చులు సామాన్యం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను నమ్మవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పత్రాలు అందుతాయి. ఆది, సోమ వారాల్లో నగదు. ఆభరణాలు జాగ్రత్త. ఇతరుల విషయాల తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లభిస్తాయి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
అవకాశాలు కలిసివస్తాయి. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల అవగాహన నెలకొంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మంగళ, బుధవారాల్లో హామీలివ్వవద్దు. ఆప్తుల సలహా పాటించండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం విజయం సంతోషపరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. గురువారం నాడు పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. కుటుంబ విషయాల పట్ల దృష్టి పెడతారు. మీ జోక్యం అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. న్యాయ, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయభివృద్ధి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.

కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
కొత్త సమస్యలెదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. తొందరపాటుతనం తగదు. పెద్దల సలహా పాటించండి. శుక్ర, శని వారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకులకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత. ప్రయాణం తలపెడతారు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆది, సోమ వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. స్వయంకృషితో రాణిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలతలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవకార్యంలో పాల్గొంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయభివృ్ద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. సమస్యలు సద్దుమణుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. మంగళ, బుధ వారాల్లో పనులు సాగవు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు ఫలిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
ఈ వారం కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు అధకం, ప్రయోజనకరం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతి తోడ్పడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో మెలకువ వహించండి. తొందరపాటుతనం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అవివాహితులకు శుభదాయకం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఈ చికాకులు తాత్కాలికమే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. గుట్టుగా యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. గురువారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ప్రయాణంలో జాగ్రత్త. జూదాల జోలికి పోవద్దు.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. ధనయోగం ఉంది. ఖర్చులు భారమనిపించదు. అవకాశాలు కలిసివస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. శుక్ర, శని వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విదేశీవిద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుకోలుదార్లతో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.దీనిపై మరింత చదవండి :