28-04-2019 నుంచి 03-05-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

రామన్| Last Modified శనివారం, 27 ఏప్రియల్ 2019 (19:22 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఖర్చులు విపతీరం. రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పురోగతి లేకా నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. మంగళ, శుక్ర వారాల్లో శకునాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతురులకివ్వడం క్షేమం కాదు.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అప్రమత్తంగా వ్యవహరించాలి. సంప్రదింపులు సాగవు. ఆలోచనులు పలువిధాలుగా ఉంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. బుధవారం నాడు కొత్త సమసల్యెదురయ్యే సూచనలున్నాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. మీ నమ్మకం వమ్ము కాదు. ఆలోచనలు కొలిక్తి వస్తాయి. పొదుపునకు అవకాశం లేదు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ కించపరచవద్దు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వైద్య, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పొదుపు ధనం అందుతుంది. ఊహించని ఖర్చులే ఉంటాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. శనివారం నాడు పనులు మొండిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. నగలు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. అంచనాలు ఫలించవు. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. ఆది, సోమ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణం వాయిదా పడుతుంది.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధఅయ కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆప్తుల సలహా పాటించండి. ఆర్థిక అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. మంగళ, బుధ వారాల్లో రావలసిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కుంటారు. సహాయం అర్థించేందుకు మనసు అంగీకరించదు. అవసరాలు వాయిదా పడుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం ద్వారా శుభవార్త వింటారు. విదేశీ విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రోజువారి ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. సకాలంలో పనులు పూర్తికాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఆరోగ్యం జాగ్రత. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రయాణాలలో జాగ్రత్త.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. శనివారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లల పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. న్యాయ, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి.

ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆది, సోమ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. రవాణా రంగాలవారికి ఆదాయాభివృద్ధి. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సంతానం దూకుడును అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కాంట్రాక్టులు, ఏజెన్సీలు అనుకూలించవు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం ఒప్పందాల్లో మెళకువ వహించండి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. అయిన వారితో విభేదాలు తలెత్తుతాయి. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగాలి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.దీనిపై మరింత చదవండి :