మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 3 ఆగస్టు 2019 (22:34 IST)

ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం... 04-08-2019 నుంచి 10-08-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులను ఆహ్వానిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అనుకూలతలున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. గురు, శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శన వీలుకాదు. ఖర్చులు విపరీతం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పూర్వ విద్యార్థులు తారసపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. గృహం సందడిగా వుంటుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. అమ్మవారికి చామంతులు, మందారాలతో అర్చన శుభదాయకం. 
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శని, ఆది వారాల్లో పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం వుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులు వుంటాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. మీ జోక్యం అనివార్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిర్వలో జాగ్రత్త. వైద్య, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. ఎర్రని పూలతో వరలక్ష్మీ దేవి ఆరాధన కలిసిరాగలదు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.
గృహమార్పు కలిసివస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులకు తరుణం కాదు. గృహం సందడిగా వుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలను విశ్వసించవద్దు. వాయిదా పడిని పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సోమ, మంగళవారాల్లో ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. తెల్ల చామంతులతో అమ్మవారికి పూజ చేస్తే శుభం, జయం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. బుధవారం నాడు ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. పరిచయం లేనివారితో జాగ్రత్త. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తులవారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. లక్ష్యసాధనకు అమ్మవారిని తెల్లనిపూలు, గులాబీలతో పూజించండి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
కొత్త సమస్యలెదురవుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితుల మోసగించే ఆస్కారం వుంది. అప్రమత్తంగా వుండాలి. సోదరులతో విభేదాలు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఖర్చులు అదుపులో వుండవు. గురు, శుక్రవారాల్లో బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య సఖ్యతలోపం. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఇతురల విషయాల్లో జోక్యం తగదు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం అందుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. చామంతులు, కనకంబరాలతో అమ్మవారి అర్చన శుభదాయకం. 
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు.
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. శని, ఆదివారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆరోగ్యం జాగ్రత్త. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. ప్రశాంతతకు అమ్మవారిని మందారాలు, గులాబీలతో పూజించండి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. సోమ, మంగళవారాల్లో పనులు సాగవు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయినవారిని విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా వుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. ఆత్మీయుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ విద్యాయత్నం నిదానంగా ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారాలకు ఆశాజనకం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. వాహనచోదకులకు దూకుడు తగదు. నీలి శంకు పూలు, మల్లెలలతో అమ్మవారి అర్చన శ్రేయస్కరం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
కొన్ని సమస్యలు తాత్కాలికంగా పరిష్కారమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు తప్పవు. బుధ, గురు వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం, సలహాలు ఆశించవద్దు. త్వరలో శుభవార్త వింటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సంకల్పసిద్ధికి తెల్ల చామంతులు, గరుడవర్థని పూలతో అమ్మవారిని పూజించండి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
పరిస్థితులు మెరుగుపడతాయి. మానసికంగా కుదుటపడుతారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. ధనానికి ఇబ్బంది వుండదు. పెద్దమొత్తంలో ధన సహాయం తగదు. మీ ఇష్టాయిస్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. శుక్ర, శని వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గులాబీలు, కనకాంబరాలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
ఈ వారం నిరాశాజనకం. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టుదలతో వ్యవహరించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు శ్రమ, పని ఒత్తిడి అధికం. వేడుకలకు హాజరవుతారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
కార్యసిద్ధికి అమ్మవారిని పసుపు పూలు, గులాబీలతో పూజించండి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
గృహమార్పు చికాకుపరుస్తుంది. పనులు సాగవు. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. ఓర్పుతో వ్యవహరించాలి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. దైవ, పుణ్య కార్యంలో పాల్గొంటారు. మందారాలు, చామంతులతో అమ్మవారి అర్చన శుభం, జయం. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
సంప్రదింపులకు అనుకూలం. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కార్యసాధనలో జయం, ధనలాభం వున్నాయి. కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసి వస్తాయి. బాద్యతగా వ్యవహరించాలి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసాలు, దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. దేవగన్నేరు, చామంతులతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు.