శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (20:59 IST)

జనవరి 10, 2021- ఉత్తరాయణంలో రవి ప్రదోషం.. వ్రత మాచరిస్తే..?

జనవరి 10, 2021. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే రవి ప్రదోషం. అంటే ఆదివారం వచ్చే ప్రదోషం. ఈ రోజున ఉపవసించడం ద్వారా సమస్త ఈతిబాధలు తొలగిపోతాయి. రవి ప్రదోషం విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సమస్త దోషాలను హరింపజేసే గుణం ప్రదోషంలో వుంది. ప్రదోషం అంటే పంచేంద్రియాలను జయిస్తుంది. 
 
ఉత్తరాయణంలో వచ్చే రవివార ప్రదోషం రోజున వ్రతాన్ని ఆచరించాలి. ప్రదోషం రోజున, ఉపవాసం, శివుడిని ఆరాధించడం, శ్లోకాలు పఠించడం.. ప్రదోషకాలంలో శివ పూజ చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ప్రదోషకాలం ముగిసిన అంటే సాయంత్రం ఆరు గంటల దాటిన తర్వాత వ్రతాన్ని ముగించాలి. ఆరు గంటల తర్వాత భోజనం చేయొచ్చు. ఉపవాసం ద్వారా శరీర అవయవాలకు శక్తిని చేకూర్చవచ్చు. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. 
 
ఉపవసించే వారు నీటిని అధికంగా తీసుకోవచ్చు. పండ్లు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. 2021లో వచ్చే తొలి రవి ప్రదోషం కావడం ద్వారా దీనిని సూర్య, భాను ప్రదోషం అని పిలుస్తారు. సంతానం కోరుకునే వారు.. అప్పులతో బాధపడుతున్నవారు.. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
Spatika Lingam
 
సాధారణంగా ఏకాదశి తిథికి మహావిష్ణువుకు, ప్రదోషం శివుడితో సంబంధం కలిగివుంటుంది. ప్రదోష వ్రతాన్ని ప్రతి నెలా రెండు త్రయోదశి తిథిలో ఆచరిస్తారు. ఈసారి ఉత్తరాయణ ప్రదోషం జనవరి త్రయోదశి తిథి జనవరి 10, ఆదివారం సాయంత్రం 04 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది జనవరి 11 సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు మధ్యాహ్నం 2.32 గంటలకు ముగుస్తుంది. రవి ప్రదోష వ్రతం ద్వారా సూర్య, చంద్రగ్రహాల అనుగ్రహం లభిస్తుంది. 
 
సూర్యుడు నవ గ్రహాలకు రాజు. రవి ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా సూర్యుడికి సంబంధించిన జాతక దోషాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. పేరు ప్రఖ్యాతలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. రవి, సోమ, శని ప్రదోష ఉపవాసాలను పూర్తి చేయడం ద్వారా ఈతిబాధలుండవు. రుణబాధలు, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏడాది పాటు ప్రదోష వ్రతాలను ఆచరించడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.