01-09-2018 నుండి 30-09-2018 వరకు మీ రాశి ఫలితాలు

1వ తేదీ శుక్రుడు తులయందు, 2వ తేద బుధుడు సింహం నందు, 17వ తేదీ రవి కన్యయందు, 18వ తేదీ బుధుడు కన్యయందు ప్రవేశం. 6వ తేదీ కృష్ణ జయంతి, 6వ తేదీ మతత్రయ ఏకాదశి, 8వ తేదీ మాసశివరాత్రి, 9 పోలాల అమావాస్య, 13వ తేదీ వినాయక చవితి, 14 ఋషిపంచమి, 20వ తేదీ సర్వఏకాదశి,

raman| Last Modified శుక్రవారం, 31 ఆగస్టు 2018 (22:14 IST)
1వ తేదీ శుక్రుడు తులయందు, 2వ తేద బుధుడు సింహం నందు, 17వ తేదీ రవి కన్యయందు, 18వ తేదీ బుధుడు కన్యయందు ప్రవేశం. 6వ తేదీ కృష్ణ జయంతి, 6వ తేదీ మతత్రయ ఏకాదశి, 8వ తేదీ మాసశివరాత్రి, 9 పోలాల అమావాస్య, 13వ తేదీ వినాయక చవితి, 14 ఋషిపంచమి, 20వ తేదీ సర్వఏకాదశి, 21వ తేదీ వామన జయంతి, 23వ తేదీ అనంతపద్మనాభవ్రతం, 27వ తేదీ ఉండ్రాళ్ళతద్ది, 28వ తేదీ సంకటహరచతుర్థి. 22వ తేదీ శనిత్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనుర్, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అనుకూల పరిస్థితులున్నాయి. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, పురస్కారాలు అందుకుంటారు. కార్యసాధనకు విఘ్నేశ్వరుని గరిక, జామ పత్రులతో పూజించండి. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. పెట్టుబడులకు తరుణం కాదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి, పనులు సానూకూలమవుతాయి. విదేశీ విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త. మారేడు దళాలు, చామంతులతో గణేశుని ఆరాధన శుభదాయకం. 
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బంధుత్వాలు బలపడుతాయి. ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రుణ సమస్యలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రయాణం తలపెడతారు. ప్రశాంతతకు మామిడి, గరికలతో గణపతిదేవుని పూజించండి. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గృహం ప్రశాంతంగా ఉంటుంది. అవివాహితులు శుభవార్త వింటారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. కార్యసిద్ధి, పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాపోటీల్లో రాణిస్తారు. ఉమ్మెత్త, గరిక, తెల్లని పూలతో వినాయకుని ఆరాధన శుభం, జయం. 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం అనుకూల, ప్రతికూలతల సమ్మేళనం, అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రేమానూబంధాలు బలపడుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు బలపడుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. ఆర్థికంగా కుదుటపడుతారు. ఇబ్బందులు తొలగుతాయి. వ్యవహాహాలతో హడావుడిగా ఉంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. వివాదాలు సద్దుమణుగుతాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. గన్నేరు, మామిడి పత్రాలతో లంబోదరుని ఆరాధన కలిసిరాగలదు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. బాధ్యతలు, వ్యాపకాలు పెంపొందుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. జామ, మారేడు దళలతో సిద్ధి వినాయకుని అర్చన శుభదాయకం.  
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్య యత్నం ఫలిస్తుంది. స్తోమతకు మించి హామిలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవకార్యాల్లో పాల్గొంటారు. యత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను గమనించండి. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. పనువు హడావుడిగా సాగుతాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు ఉండదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు. నేరేడు, మారేడు దళలతో విఘ్నేశ్వరుని అర్చన కలిసిరాగలదు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. బంధువులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. ఖర్చులు అధికం, రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతుల మధ్య అవగాహన లోవం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. అప్రమత్తంగా వ్యవహరించాలి. నమ్మకస్తులే వంచించేందుకు యత్నిస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవురాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారిక సామాన్యం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. జిల్లేడు, జామ, తెల్లనిపూలతో గణాధిపతి అర్చన శుభదాయకం.
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు చేసే అవకాశం లేదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారు మీ వ్యాఖ్యాలను అపార్ధం చేసుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు అనివార్యం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. లక్ష్య సాధనకు మామిడి, తెల్ల జిల్లేడు పత్రాలతో సిద్ధి గణపతిని పూజించండి. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. పట్టుదలతో వ్యవహరించాలి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. దైవకార్యానికి సాయం అందిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. క్రీడాకారులకు ఆశాభంగం. మారేడు, గరిక, జిల్లేడు పత్రాలతో వినాయకుని ఆరాధన శుభదాయకం. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. సంప్రదింపులు ఫలించవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ విషయాలు పట్టించుకోండి. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వైద్య, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మామిడి, నేరేడు, తెల్లని పూలతో గణపతి ఆరాధన శుభం, జయం.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు సామాన్యం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తికాగలవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మీ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దైవకార్యం, సన్మాన సభల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. గణపతిని తెల్ల జిల్లేడు, కలువలతో అర్చన శుభదాయకం.దీనిపై మరింత చదవండి :