శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (17:42 IST)

సొంత ఇంటి కల నెరవేరాలంటే? సోమవారం జాజిపూలతో?

గృహం కొనుక్కోవాలనుకుంటున్నారా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? అయితే ఇలా చేయండి. గృహం కొనాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? జ్యోతిష్యులు గృహం కొనేది లేదని.. జాతకాలు సరిగ్గా లేవని చేతులెత్తేశారా? అయితే ఇ

గృహం కొనుక్కోవాలనుకుంటున్నారా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? అయితే ఇలా చేయండి. గృహం కొనాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? జ్యోతిష్యులు గృహం కొనేది లేదని.. జాతకాలు సరిగ్గా లేవని చేతులెత్తేశారా? అయితే ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వుంటే పరమేశ్వరుడిని పూజించినట్లైతే గృహం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరిక తీరకుండా, దాని కోసం కష్టపడేవారు ఇలా సోమవారం పూజ చేస్తే గృహం సిద్ధిస్తుంది. సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. సొంత ఇల్లు కొనుక్కోవాలంటే, ఆ ఇంటి ఇల్లాలు సోమవారంనాడు ఇలా పూజ చేయాలి. 
 
జాజిపూజలో పరమేశ్వరుడిని పూజించాలి. జాతకరీత్యా గృహ యోగం వున్నా లేకపోయినా పరమేశ్వరుడిని జాజిపువ్వులతో పూజించి.. పంచాక్షరితో స్తుతిస్తే ఇంటికల సాకారం అవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.