సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (16:07 IST)

రెండో నెంబరు వారి వివాహ జీవితం ఎలా ఉంటుందంటే..?

రెండో నెంబరు వారి వివాహ జీవితం చాలా ఆనందదాయకంగా ఉండగలదు. ప్రేమించి వివాహం చేసుకున్న సుఖప్రధంగా ఉండగలదు. చర్య మంచి సంస్కారం కలవారు. ఉన్నత విద్యగలవారై వుందురు. వీరు 1వ సంఖ్యవారిని ప్రేమించిన శుభం. వీరికి 3, 5, 8 సంఖ్య వారిని వివాహం చేసుకున్న చాలా బాగుగా ఉండగలదు. 25 సంవత్సరంలోపు వివాహం చేసుకున్న చాలా బాగుగా ఉండగలదు. వీరికి ఎక్కువగా 25-30 సంవత్సరాల మధ్య వివాహం జరుగును. వారికి మంచి యోగప్రదులైన సంతానం జన్మించగలదు. 
 
జీవితంలో వస్తు, వాహన, గృహాదులు బాగుగా ఉండగలదు. అయితే వీరి పేరుకు తగిన సంపాదన కూడా చాలదు. ఆర్థికంగా వివాహ అనంతరం చాలా శుభదాయకంగా ఉండగలదు. 30 సంవత్సరముల ఆర్థికంగా స్థిరపడగలరు. వీరికి వస్తువులు గృహ నిర్మాణం, అతిశుభ్రత అధికంగా ఉండగలదు. కళత్రమునకు అంత శుభ్రం వుండజాలదు అనే చెప్పవచ్చు. ఏ వస్తువు ఎక్కడ పెట్టింది అక్కడ వుండాలి అనే అభిప్రాయం వుడగలదు. కొంత మతిమరుపు కూడా ఉండగలదు.
 
వ్యాపార, రచనా రంగాలలో నెమ్మదిగా కష్టించి పైకి రాగలరు. రాజకీయ నాయకులు ఊహించకుండా అభివృద్ధి పొందగలరు. ఎవరితోను ఏకీభవించకపోవడం వలన ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి దెబ్బ తినడానికి ఆస్కారం గలదు. వీరు చాలా ప్రఖ్యాతి గాంచగలరు. కళారంగంలో సామాన్యంగా వుండగలరు.  ఫ్యాక్టరీస్ స్థాపించిన పత్రికారంగంలో వారు మాత్రం మంచి స్థాయికి చేరుకోగలరు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు అలంకరిస్తాయి. సేవకా వృత్తులలో స్థిరమైన జీవితం గడపగలుగుతారు. ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్ళుటకు ఆస్కారం ఉండగలదు. అయితే 40 సంవత్సరం నుంచి వీరి కోర్కెలు నెరవేరగలవు.