బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (21:54 IST)

మీ రాశి ఫలితాలు (21-06-17)... ఊహించని విజయం...

మేషం.. ఆర్థికాభివృద్ధికి కానవస్తుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు నడుము, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులకు ఒత్త

మేషం..
ఆర్థికాభివృద్ధికి కానవస్తుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు నడుము, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు పర్యటనలు అధికమవుతాయి. 
 
వృషభం
ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. దైవ, సేవా పుణ్యకార్యాలకు బాగా వెచ్చిస్తారు. 
 
మిథునం 
టెక్నికల్, వైజ్ఞానికి రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఖర్చులు మీరు ఊహించని దానికంటే మరింతగా పెరుగుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. 
 
కర్కాటకం 
పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానం అందుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
సింహం 
విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. సన్నిహితులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కుటుంబ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు 
 
కన్య
ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఊహించని విజయం మిమ్మలను ఆనందంలో ముంచెత్తుతుంది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
తుల 
రాజకీయ నాయకులకు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. తలచిన కార్యక్రమాలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దంపతుల మధ్య సంతానం విద్యా విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యాల్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దగలదు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం 
ఏసీ, కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. పాత రుణాలు తీరుస్తారు. అనుకోని అతిథులు ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. 
 
ధనస్సు 
చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగి రాజాలదు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్లు, నడుము నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 
 
మకరం 
మానసిక చికాకులు, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. 
 
కుంభం 
స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సిఫార్సులతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం
సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.