మంగళవారం వెన్నతో హనుమంతునికి అభిషేకం చేస్తే..?
ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడనీ, హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు ముందుగా రామచంద్రుడి భక్తులై వుండాలని పండితులు అంటున్నారు. తనని పూజిస్తే మురిసిపోయే హనుమంతుడు .. రామచంద్రుడిని కీర్తిస్తే పరవశించి పోతాడు. అందుకే రాముడితో కలిపి హనుమంతుడిని సేవించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా హనుమంతుడికి మంగళవారం, శనివారం అంటే ఎంతో ఇష్టం.
అందువలన ఆ రోజుల్లో ఆయనకి ప్రదక్షిణలు చేయాలి. సింధూర అభిషేకం ఆకుపూజ చేయించాలి. వడలు తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మంగళ, శనివారాల్లో 'సుందరకాండ' పారాయణం, 'హనుమాన్ చాలీసా' చదువుకోవడం.. నామ సంకీర్తనం చేయడం వలన, హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయురారోగ్యాలు, సిరి సంపదలను అనుగ్రహిస్తాడు.
అలాగే వెన్నతో అభిషేకం చేయించే వారికి సకల దోషాలు నివృత్తి అవుతాయి. అమావాస్య, శుక్ల, కృష్ణ పక్ష నవమి రోజుల్లో వెన్నతో అభిషేకం లేదా అలంకరణ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.