మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (12:02 IST)

ఉగాది పంచాంగం: ఈ ఏడాది కష్టాలే.. ఎండలు-వర్షాలు రెండూ ఎక్కువే

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ.. విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జ

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ..  విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జరగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. 
 
ఇదే సమయంలో మకరరాశిలో కుజ స్తంభన జరుగుతోందని.. కేతువును కుజుడు కలవనున్నాడు. ఈ పరిణామాలు ఈ ఏడాది అధికమైన కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ పరిణామాల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పవని, రాజకీయ మార్పులు ఏర్పడతాయి. వర్షపాతం అధికంగా నమోదవుతుందని.. ఎండలు కూడా విపరీతంగా వుంటాయని స్వామి తెలిపారు.