ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (17:30 IST)

ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేస్తున్నారా?

ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లైనా సాయంత్రం సమయంలో ధూపం వేయడం చేయాలి. 
 
డ్రాయింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫోటోలు పెట్టాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఇంట్లో పనిచేయని ఫ్రేములు, ఫోటోలు గడియారాలు వుంచకూడదు. అపరిశుభ్రంగా ఏ ఫొటోనూ ఉంచరాదు. పగిలిన విరిగిన వస్తువులు కూడా ఉంచరాదని వాస్తు చెప్తోంది.