గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (11:03 IST)

వాస్తు శాస్త్రం: ఇంట్లో శివుడి బొమ్మను మాత్రమే ఉంచుకోవచ్చా?

Lord Shiva
ఇంట్లో శివుడి బొమ్మను మాత్రమే ఉంచుకోవద్దని, పార్వతితో ఉన్న శివుడి ఫోటోను మాత్రమే ఉంచుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు. చాలామంది శివ భక్తుల ఇంట్లో శివుని చిత్రం ఉంటుంది. కానీ శివుని చిత్రం పటం మాత్రం ఇంట్లో వుంచకూడదు. శివపార్వతుల చిత్రపటాన్ని జంటగా ఉంచాలి. శివుని ప్రతిమను ఒంటరిగా ఉంచితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తప్పవని వాస్తు శాస్త్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. 
 
భార్యాభర్తలు కలిసి జీవించి సుఖంగా జీవించాలంటే శివపార్వతుల ఫోటో పెట్టి పూజించవచ్చు. శివునికి ప్రీతికరమైన రోజు సోమవారం. సోమవారం నాడు శివుని వ్రతం ఆచరించిన వారికి కోరిన కోరికలు, వరాలు చేకూరుతాయని విశ్వాసం. శివపార్వతుల ఫోటోతో పూజించి సకల సంపదలు పొంది జీవించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ శివుని బొమ్మను మాత్రం ఇంట్లో ఎప్పుడూ పెట్టకండి. ఇది ఆనందం, శాంతికి భంగం కలుగుతుంది. అందుకే శివపార్వతుల ఫోటోను ఇంట్లో వుంచి పూజించడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది.
 
ఉత్తర దిశ శివునికి ఇష్టమైన దిక్కు. ఈ దిశలో శివుని నివాసం, అంటే కైలాస పర్వతం. అందుకే ఇంట్లో శివుని బొమ్మ పెట్టాలంటే ఉత్తరం దిక్కును ఎంచుకోవాలి. ఈ దిశలో చిత్రాన్ని వుంచి పూజిస్తే.. శుభ ఫలితాలను ఇస్తుంది.