సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (13:48 IST)

గర్భిణులు చంద్ర గ్రహణం చూస్తే.. ఏమవుతుంది..?

చంద్ర గ్రహణం గర్భిణులు చూడకూడదని చాలామంది చెప్తుంటారు. అంతే ఈ గ్రహణాన్ని చూస్తే కళ్లు పోతాయని కూడా చెప్తుంటారు. ఈ గ్రహణాన్ని చూసిన వారిలో చాలామంది కంటి చూపు కోల్పోయారని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. మరి ఈ గ్రహణం ఎప్పుడు వస్తుందో.. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలోనని బాధపడుతున్నారా.. అయితే దీనిని చదవండి.. 
 
కాలమానం ప్రకారం జనవరి 21న అంటే ఈరోజు చంద్ర గ్రహణం. ఈ చంద్ర గ్రహణానికి మరో పేరు బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్ర గ్రహణానికి హిందూ మతంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇదిలా ఉంటే.. ఏ గ్రహణం ఏర్పడిన దానికి తగిన నియమాలు, జాగ్రత్తలు పాటించాలని పురాణాలు చెప్తున్నాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, కొన్ని నక్షత్రాలు, రాశులు వారు ఈ గ్రహణాన్ని చూడరాదని పండితులు చెబుతున్నారు.
 
గ్రహణం ఏర్పడిన వెంటనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా.. గ్రహణం పూర్తయిన తరువాత.. ఇంటిని శుభ్రం చేసుకుని.. ఇంట్లోని ప్రతిఒక్కరూ తలస్నానం చేసే మీరు ప్రార్థించే దైవానికి పూజలు చేయాలి. అలానే గర్భిణి స్త్రీలు గ్రహణ సమయంలో అటూఇటూ కదలకుండా ఒకేచోట ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లకూడదు. ఈ గ్రహణాన్ని గర్భిణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
ఎందుకంటే కడుపులోని శిశువుపై ఆ చంద్రుని కిరణాలు పడకూడదనేది విశ్వాసం. ఒకవేళ పడితే ఆ శిశువు పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ, అందువలన గ్రహణానికి ముందే గర్భిణులు నిద్రిస్తే మంచిది. ఆపై గ్రహణం పూర్తయిన తరువాత తలస్నానం చేసి మీ ఇష్టదైవానికి పూజలు చేయాలి. ఈ నియామాలు పాటిస్తే.. గ్రహణ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.