శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (12:56 IST)

కంటిచూపుతోనే మగాళ్లను అంచనా వేసేస్తున్న యువతులు.. ఆ శక్తి పెరిగిపోతుందట..

మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగ

మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగా ఉంటున్న మగవారి మనసులో ఏ ఉద్దేశం ఉందో యువతులు తేలిగ్గా పసిగట్టేస్తున్నారని.. మగవారి మాటలను, కంటిచూపును పరిశీలించడం ద్వారా వారు ఎలాంటి వారో ఓ అంచనాను వచ్చేస్తున్నారని కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.
 
తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అతి నిశితంగా పరిశీలించడం.. రోజువారీ సంఘటనల ఆధారంగా ఆడవారిలో అంచనా శక్తి  పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలే వారి అంచనా శక్తిని పెంచేందుకు కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
 
పురుషులు ఎలాంటి వారో వారి చూపులు.. ఆలోచనల బట్టి మహిళలు తెలుసుకుంటున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా 89వేల మందిపై జరిగిన ఈ సర్వేలో 50 శాతం మంది మ‌హిళ‌లు ఎదుటివారి చూపుల ద్వారా వారి ఆలోచనల్ని తేలిక‌గా కనిపెట్టేయగలిగారని పరిశోధకులు తెలిపారు.