గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:13 IST)

విశ్వకర్మను దర్శించుకుంటే..?

ప్రపంచంలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసినా, ఓ నిర్మాణం కనిపించినా విశ్వకర్మ సృష్టి అంటుంటాం. వేదవిదులైనా సకల జగత్ సృష్టికర్త అంటారు. పౌరాణికుల మాత్రం లోకాలనూ నిర్మించే దేవశిల్పి అంటారు. అలాంటి వాటిల్లో ఋగ్వేదంలో సృష్టి సూక్తాలు పేరిట కనిపించే నాలుగు సూక్తాలలో విశ్వకర్మ సూక్తం ఒకటి. వేదదేవతలలో ఒకడిగా చెప్పబడిన ఈ స్వామి పురాణాలలో పంచముఖుడిగా దర్శనమిస్తాడు. 
 
స్వామివారి ఐదుముఖాల నుండి ఐదుగురు మహర్షులు ఆవిర్భవించారు. వారే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞలు. ఈ ఐదుగురికి ఐదు రకాలైన శిల్పకార్యాలను ఉపదేశించి సృష్టిని వృద్ధి చేయమని ఆదేశించాడు. విశ్వకర్మ శిల్పాలు, ఆలయాలు దేశమంతట ఉన్నా అక్కడక్కడా అరుదైన విగ్రహాలు కనిపిస్తాయి.
 
ఐదు ముఖాలతో, పది చేతులతో దర్శనమిస్తారు విశ్వకర్మ. నిజహస్తాలలో అభయ-వరదముద్రలతో, పరహస్తాలలో శంఖం, చక్రం, విల్లు, బాణం, త్రిశూలం, డమరుకం, టంకం, నాగం దర్శనమిస్తాడు. విశ్వకర్మ దర్శనంతో సకల బంధనాలనుండి విడవడతారనీ, ఈయన చస్పతి కనుక చక్కటి విద్య, సకలైశ్వర్యాలు చేకూరుతాయని, పరంలో మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.